Header Banner

హైదరాబాద్ లో విషాదం! రేసుగుర్రాలు అంతుచిక్కని పరిస్థితుల్లో..

  Sun May 25, 2025 08:19        Others

దేశవ్యాప్తంగా గుర్రపు పందేల ప్రియులు, జంతు ప్రేమికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసే ఘటన ఇది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో సంభవించింది. హైదరాబాద్ నుండి జబల్‌పూర్ కు తరలించిన 57 రేసు గుర్రాల్లో ఎనిమిది మరణించాయి. అయిదు రోజుల వ్యవధిలో అవి తుదిశ్వాస విడిచాయి. వాటి మరణం ఇప్పుడు మిస్టీరియస్ గా మారింది.మరణించిన ఈ గుర్రాలన్నీ కూడా థోరోబ్రెడ్, కథియావారీ, మార్వారీ వంటి ప్రతిష్టాత్మక జాతులకు చెందినవి. ఏప్రిల్ 29- మే 5వ తేదీ మధ్య ఈ 57 గుర్రాలను రోడ్డు మార్గంలో జబల్ పూర్ జిల్లాలోని రాయ్‌పుర అనే గ్రామానికి తరలించారు. ఓ ప్రైవేట్ రేస్‌ కోర్సు కోసం వాటిని అక్కడికి షిఫ్ట్ చేశారు.

 

ఇక్కడికి వచ్చిన అతికొద్ది రోజుల్లోనే చాలా గుర్రాలు అనారోగ్యానికి గురయ్యాయి. ఈ నెల 13వ తేదీ నాటికి ఏకంగా ఎనిమిది గుర్రాలు మరణించాయి. వీటి మరణం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈక్వెస్ట్రియన్లు, జంతు ప్రేమికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురి అవుతున్నారు. వీటి మరణం మిస్టీరియస్ గా మారింది.గ్లాండర్స్ అనే అత్యంత అరుదైన అంటువ్యాధి బారిన పడి అవి మరణించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. మధ్యప్రదేశ్ పశు వైద్య అధికారులు అన్ని గుర్రాల రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం హర్యానా హిసార్‌లోని నేషనల్ ఈక్విన్ రీసెర్చ్ సెంటర్‌కు పంపారు.

 

ఇప్పటివరకు 44 నమూనాలకు నెగెటివ్ అని తేలింది. మిగిలిన గుర్రాల శాంపిల్స్ ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. ఈ గుర్రాలను ఇంటర్ స్టేట్ మెడికల్ పర్మిషన్లేవీ లేకుండా తరలించారని, రవాణా సమయంలో ఆరోగ్య పర్యవేక్షణ కూడా సరిగా లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ పరిణామాలపై నేపథ్యంలో భోపాల్ నుండి ముగ్గురు సభ్యుల నిజ నిర్ధారణ బృందం ఈ నెల 17వ తేదీన రాయ్‌పురాను సందర్శించింది. ఈ టీమ్ ఇచ్చే నివేదిక త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి అందే అవకాశాలు ఉన్నాయి. ఈ గ్లాండర్స్ వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా జబల్ పూర్ జిల్లా యంత్రాంగం తక్షణమే రంగంలోకి దిగింది.

 

ఇది కూడా చదవండి: మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత! టీడీపీ కార్యకర్తల జంట హత్యలు! గొడ్డలితో వెంటాడి...

 

కలెక్టర్ దీపక్ సక్సేనా నేతృత్వంలో జిల్లా యంత్రాంగం మిగిలిన గుర్రాల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి ఓ రాపిడ్ రెస్పాన్స్ బృందాన్ని మోహరింపజేసింది. గుర్రాలను హైదరాబాద్ నుండి తరలించడానికి అవసరమైన అనుమతి పత్రాలు, ఇందులో నిర్లక్ష్యంపై దర్యాప్తు చేపట్టాలని కలెక్టర్.. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు కూడా.ఇదిలావుండగా- ఈ ఘటనపై పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (PETA)కు చెందిన జంతుహక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. జంతువుల రవాణా, సంరక్షణలో కఠినమైన నిబంధనలను రూపొందించాల్సిన అవసరం తలెత్తిందని, వాటి పర్యవేక్షణపై మార్గదర్శకాలను రూపొందించాలని డిమాండ్ చేస్తోన్నాయి.

 

జిల్లా వ్యాప్తంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్న జంతు సంక్షేమ సంఘాలు మధ్యప్రదేశ్ హైకోర్టులో పిల్ దాఖలు చేయాలని నిర్ణయించాయి. జబల్ పూర్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం.. జంతు క్రూరత్వానికి సంబంధించిన కేసు మాత్రమే కాదని, అనేక మోసాలకు సంబంధించినదని మండిపడుతున్నాయి.ఈ దారుణానికి బాధ్యులైన వారిని అరెస్ట్ చేయాలని, మూగజీవాల మధ్య ఆటల పోటీలు, వాణిజ్యం, వినోదం పేరుతో నిర్వహిస్తోన్న ఈవెంట్ల వంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తోన్నాయి.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మహిళలకు గుడ్ న్యూస్! ఇక ఇంటి దగ్గరే సంపాదించుకునే ఛాన్స్!

 

భారతీయులకు షెంజెన్ వీసాల తిరస్కరణ! 17 లక్షల దరఖాస్తులు..!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! రేషన్ హోమ్ డెలివరీ.. ఎవరెవరికంటే!

 


ఇసుక స్కాం బట్టబయలు.. SIT దృష్టిలో ఆ నలుగురు! ఒక్కటైపోయిన..

 

జూన్ 1 నుండి రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!



వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సీఐ రాచమర్యాదలు! ప్రజల ఆగ్రహం..!


ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా పిటిషన్లు! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!


భారత్ లో కొత్త బైక్ లాంచ్ చేసిన హోండా! ఆధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో...


విజ్ఞానశాస్త్రంలో మరో ముందడుగు! యాంటీమ్యాటర్ రవాణాకు ప్రత్యేక కంటైనర్!


కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఏం చర్చించారంటే?



ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యత అప్పగించిన కేంద్రం! ధాన్యం సేకరణపై ప్రత్యేక ఫోకస్!



నేడు (24/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!



ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #HyderabadNews #RacehorseTragedy #HorseRacing #AnimalWelfare #HyderabadUpdates #TelanganaNews #AnimalRights